చెర‌కుర‌సం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే

These are the benefits of sugarcane juice

0
67

మ‌న దేశంలో చెర‌కు పంట ఎంతో ఎక్కువ‌గా వేస్తారు. ముఖ్యంగా చెర‌కుతో చ‌క్కెర త‌యారీ చేస్తారు అనేది తెలిసిందే. అయితే చెర‌కు ర‌సం కూడా చాలా మంది ఇష్టంగా తాగుతారు. చాలా మంది స‌మ్మ‌ర్ లో ఎక్కువ‌గా తీసుకునే ర‌సం ఇది. అయితే మ‌న దేశంలో చాలా స్టేట్స్ లో చెర‌కు పంట బాగా పండుతుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఎక్కువ‌గా పండిస్తారు.

చెరకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఈ చెర‌కు ర‌సం తాగ‌డం వ‌ల్ల ఇన్ స్టంట్ ఎన‌ర్జీ వ‌స్తుంది, అంతేకాదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఐస్ కాకుండా ఉత్తి చెర‌కు ర‌సం ఎంతో మంచిది. చెర‌కు ర‌సం మీ శ‌రీరంలో వేడిని త‌గ్గిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
చెరకు రసం కిడ్నీలను శుభ్రపరుస్తుంది.

చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇక నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది. అంతేకాదు మొటిమల స‌మ‌స్యలు ఉన్నా త‌గ్గుతాయి.చెరకు రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఎవ‌రైనా జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటే ఆ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.