ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్దితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ అమెరికా బలగాలు వెనక్కి వెళ్లడంతో తాలిబన్లు ఆ దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు దీంతో అక్కడ ప్రజలు బిక్కు బిక్కు మంటూ ఉన్నారు. అయితే గత తాలిబన్ల పాలన గుర్తు చేసుకుంటున్నారు జనం. మళ్లీ ఆరోజులు వస్తాయా అనే భయం వారిని వెంటాడుతోంది. ఆ దేశ ప్రజలు విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అంతేకాదు అక్కడ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వారు అందరూ కూడా తమ ఆస్తులు వదులుకుని వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇమ్రాన్ అనే యువకుడు భారత్ కు వచ్చాడు. ఇమ్రాన్ ఆఫ్ఘనిస్థాన్లో కోటీశ్వరుడు. అతడికి ఆ దేశంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు వ్యాపారాలు ఉన్నాయి అతని వయసు 28 ఏళ్లు అన్నీ వదులుకుని ఇక్కడకు వచ్చాడు. ఢిల్లీకి వచ్చిన అతను చెప్పిన మాట ఏమిటి అంటే, కాబుల్లో మూడు కోట్ల టర్న్ఓవర్ కలిగిన ఆటో స్పేర్ పార్ట్ వ్యాపారం కూడా ఉంది అది వదిలేశాడు.
అయితే కోట్ల రూపాయల ఆస్తుల కన్నా ప్రాణమే ముఖ్యమని ఆఫ్ఘన్ ని వదిలివచ్చేశాడు. ఇక అక్కడ ఉన్న తమ కుటుంబాలని కూడా రక్షించాలి అని చాలా మంది కోరుతున్నారు ఇలా ఎందరో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తున్నారు.