బ్రాహ్మీముహర్తం అంటే ఏమిటి ఈ సమయంలో నిద్ర లేచి ఏం చేయాలి

What is Brahmimuhartam?

0
88

మన పెద్దలు తాతయ్యలు, నాయనమ్మలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అని చెబుతారు. ఎందుకు అంటే ఇలా నిద్ర లేవడం వల్ల ఎంతో ఉత్తేజంగా ఉంటాం. అంతేకాదు చేసే పనిలో ఎంతో ఏకాగ్రత ఉంటుంది అని చెబుతారు. బ్రాహ్మిమూర్తంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు పెద్దలు. ఇక్కడ ఓ విషయం తెలుసుకోవాలి బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి అనేది.

సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే ఋతువులను బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి. కనుక తెల్లవారు జామున 4:00-4:30 మధ్య కాలాన్ని బ్రాహ్మీముహూర్తంగా పెద్దలు చెబుతారు. దీని ప్రకారం మనం బ్రహ్మి ముహూర్తం తెలుసుకోవాలి.

బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. ఇలా నిద్ర లేచిన వెంటనే ఆ లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు పండితులు కూడా చెబుతున్నారు.ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా మంచిది. ఉదయం సూర్యనమస్కారాలు చేసుకునేవారికి యోగా ఇలా అన్నింటికి ఎంతో మంచి సమయం. ఈ సమయంలో నాడి చాలా ఉత్తేజితంగా ఉంటుంది.