దారుణం – ఉగ్రవాదులని జైళ్ల నుంచి విడిచిపెడుతున్న తాలిబన్లు వీడియో ఇదిగో

The Taliban are releasing terrorists from prisons

0
96

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టారు. అయితే ఇప్పుడు వారి క్యాంప్ బేస్ మారిపోయింది. ఇక అధ్యక్షుడు రాజభవనం వదిలి వెళ్లడంతో ఈ తాలిబన్ ట్రూపు సభ్యులు అందరూ ఆ దేశాధ్యక్ష అధికారిక భవనంలో రాజభోగాలను చవిచూస్తున్నారు. పంచభక్ష్యాలతో విందులు చేసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే అరెస్ట్ చేసిన చాలా మందిని విడుదల చేస్తున్నారు. వారి టీమ్ లోకి తీసుకుంటున్నారు.

అమెరికాకు ఆఫ్ఘనిస్థాన్ లో అతిపెద్ద ఎయిర్ బేస్ అయిన బగ్రాం ఎయిర్ బేస్ నుంచి వేలాది మంది ప్రమాదకర ఉగ్రవాదులను విడుదల చేశారు. ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఐఎస్, అల్ ఖాయిదా, తాలిబన్, ఇతర ముఠాలకు చెందిన 5 వేల మంది ఉగ్రవాదులను తాలిబన్లు విడిచిపెట్టారు.

కాబూల్ జైళ్ల నుంచి తాలిబన్లు విడిచిపెట్టారంటూ అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చర్యల వల్ల వచ్చే రోజుల్లో ఎంతో ముప్పు పొంచి ఉంది అంటున్నారు నిపుణులు.

https://twitter.com/i/status/1426971775405989888