పొలంలో కాటేసిన రక్తపింజర చివరకు దానిని నోటితో కరిచి ఏం చేశాడంటే

The blood clot that was cut in the field finally bit it into the mouth and that’s what happened

0
101

పాముని చూస్తేనే మనం వణికిపోతాం . అక్కడ పాము ఉంది అని తెలిస్తే అక్కడనుంచి జంప్ అవుతాం. ఎందుకంటే ఎక్కడ అది మనల్ని కాటు వేస్తుందా అనే భయం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఎన్నోచూశాం. అయితే కొందరు ఏకంగా పాములని చంపేస్తున్నారు. తమని కాటు వేశాయని కోపం, మరో పక్క తమ ఇంటిలోకి వచ్చాయి అని వెంటనే వాటిని చంపేసి ఊరంతా

తిరుగుతూ చూపిస్తున్నారు.

ఇంకొందరు ఏదో స్నాక్ ఐటెమ్ లా స్నేక్ ని పళ్లతో కొరుకుతున్నారు. ఈ వ్యక్తి తనను విష సర్పం కాటేసిందని పగ తీర్చుకున్నాడు. ఆ పామును వెతికి పట్టుకుని నోటితో కొరికి చంపాడు. ఆ తర్వాత దాని రక్తం తాగి ఊరంతా తిరిగాడు.
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో శాలిజంగా పంచాయతీ గంభారిపటియా గ్రామంలో ఈ ఘ‌ట‌న జరిగింది.

ఈ గ్రామానికి చెందిన కిశోర్ భదరా అనే వ్యక్తి తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతనిని రక్తపింజర కాటేసింది. వెంటనే దానిని పట్టుకున్నాడు నోటితో కొరికి చంపాడు. ఇక ఊరంతా దానిని పట్టుకుని తిరిగాడు. భార్య బంధువులు ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. దీంతో నాటు వైద్యం చేయించుకున్నాడు . తాను బాగానే ఉన్నానని తనకెలాంటి సమస్య లేదని కిషోర్ అన్నాడు.