ఇది ఎంతో దారుణమైన ఘటన. ఇలాంటి వారు ఉన్నారా? ఇంత మూఢనమ్మకాలు విశ్వసించేవారు ఉన్నారా అనిపిస్తుంది ఈ ఘటన వింటే. మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. ఇంతకీ ఎంత దారుణమంటే వారి శరీరంలో పాము డీఎన్ఏ ఉందని, వారు పెరిగితే పిశాచులై ప్రపంచాన్ని చంపేస్తారని ఇలా చేశాడట.
అమెరికాలో జరిగిన ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.
కాలిఫోర్నియాలోని మాథ్యూ టేలర్ కోల్ మన్ అనే వ్యక్తి ఆగస్టు 7న తన ఇద్దరు చిన్నారులని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అతను ఆ తర్వాత నుంచి ఫోన్ లో అందుబాటులోకి రాలేదు. భార్యకు ఏ సమాధానం చెప్పలేదు. దీంతో భార్య పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు అంటే మెక్సికోలో అని తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేసి పిల్లల గురించి అడిగారు. నా పిల్లల్లో పాము డీఎన్ఏ ఉంది. ఏవో తెలియని అతీత శక్తులు నాకు ఆ విషయాన్ని చెప్పాయి. అందుకే వారి బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాను. చేపలను వేటాడే గాలం బాణంతో చంపేశాను అని చెప్పాడు.ఈ మాట విని పోలీసులు అతని భార్య షాక్ అయింది. ఇంత మూఢనమ్మకంతో ఇద్దరు పిల్లలని చంపుకున్నాడు. అతను చేసిన పనికి స్ధానికులు బంధువులు అందరూ షాక్ అయ్యారు.