మన దేశంలో ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక అనేక ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం దేవుళ్లను పూజించే విధానం, భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే అనేక దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడకు వచ్చి ఆలయాలు సందర్శిస్తారు ఈ పద్దతులు సంప్రదాయాలు తెలుసుకంటారు.
ఇక్కడ దేవుడికి పెట్టే నేవైద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి. మనం చూస్తు ఉంటాం ఆలయాల్లో లడ్డూ పులిహోర చక్కెర పొంగలి ఇలాంటివి ప్రసాదంగా పెడతారు. అయితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా లో ప్రత్యేక ఆలయం ఉంది. అక్కడ దేవుడికి నైవేద్యంగా న్యూడుల్స్ పెడతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఆ విశేషాలు తెలుసుకుందాం.
కోల్ కత్తాలోని చైనా టౌన్ లో తంగ్రా అనే ప్రాంతం అక్కడ చైనీస్ కాళీ మాత ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలకు వెళ్తే ఇక్కడ అంతా చైనా జపాన్ లో ఉన్నట్లు ఉంటుంది. అక్కడకు చాలా మంది విదేశీ పర్యాటకులు వెళుతూ ఉంటారు. ఇక్కడ కాళీ మాత ఆలయంలో భక్తులు న్యూడిల్స్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదే ప్రసాదంగా భక్తులకి ఆలయంలో ఇస్తారు.
ఇక్కడ చాలా మంది చైనీయులు ఉన్నారు. వారంతా ఇండియాలో స్థిరపడిపోయారు. వారు ఇలా న్యూడిల్స్ అనేది ప్రసాదంగా ముందు నుంచి ఇవ్వడం ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా బెంగాలీ ప్రజలు, చైనా ప్రజలు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. దాదాపు ఈ ఆలయం 60 ఏళ్ల నుంచి ఉందని చెబుతున్నారు.