ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ దారుణంలో ఇప్పటి వరకూ 90 మంది మరణించారు. నిన్న జరిగిన ఈ పేలుడులో చాలా మంది గాయపడ్డారు. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గేటు దగ్గర జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు దగ్గర మొదటి పేలుడు జరిగింది. రెండో పేలుడు బేరన్ హోటల్ దగ్గర జరిగింది.
ఇక్కడ మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉన్నారు. పెంటగాన్ వర్గాలు దీనిపై సీరియస్ అయ్యాయి. ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. దీంతో అమెరికా కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘాతుకం తమ పనే అని ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది.
అయితే ఇలా పేలుడు జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు చెబుతూనే ఉన్నాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనకు కారకులు అయిన వారిని విడిచిపెట్టము అని హెచ్చరించారు.