కాకరకాయ రసం తాగుతున్నారా? రోజూ తాగితే మంచిదేనా ఈ విషయాలు తెలుసుకోండి

Are you Drinking Daily Bitter gourd juice

0
82

కాకరకాయ అనేసరికి చాలా మంది మాకు వద్దు చేదు ఇది తినలేము అంటారు. మరికొందరు మాత్రం కాకరకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది షుగర్ పేషెంట్లు దీనిని తీసుకుంటారు. ప్రతిరోజు కాకర జ్యూస్ కూడా తాగవచ్చా అంటే ? వారానికి రెండు రోజులు తాగితే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే వైద్య నిపుణులు చెప్పేది ఒకటే ఏది అయినా అతిగా తీసుకోకూడదు అలాగే కాకరకాయ జ్యూస్ రోజూ తీసుకున్నా ఇబ్బంది ఉంది. కడుపులో తిప్పడం వాంతులు వికారం అజీర్తి సమస్యలు ఇలాంటివి వస్తాయి.అందుకే వారానికి రెండు సార్లు తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

కాకరకాయ రసంలో తగినంత మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. మీకు ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది. మెదడుకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.చర్మానికి చాలా మంచిది షుగర్ ఉంటే కంట్రోల్ ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది. గుండె జబ్బుల నుంచి దూరం చేస్తుంది.

గ‌మ‌నిక‌-
నిమ్మకాయ రసం తీసుకున్న వెంటనే కాకరకాయ జ్యూస్ తీసుకోవద్దు. రోజు ఏదో ఓ రసం మాత్రమే తీసుకోవాలి. కూరగాయల రసం కాకరకాయ రసం నిమ్మరసం ఇలా ఏదైనా తీసుకుంటే కొద్ది రోజలు ఒకటే వాడండి. తర్వాత మరో రసం తాగాలి .అంతే కానీ రోజూ రెండు మూడు రకాల రసాలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.