ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఎలాంటి కఠిన ఆంక్షలు పెట్టము అని చెబుతూనే కఠిన ఆంక్షలు మహిళలకు పెడుతున్నారు. బయటకు మహిళలు కొన్ని ప్రాంతాల్లో రాకుండా నిలువరిస్తున్నారు. ఉద్యోగాలు చేయకూడదు అని చెబుతున్నారు. కాందహార్లో తాలిబన్లు కఠినమైన ఆంక్షలను ప్రకటించారు. సంగీతంపైనా, టెలివిజన్, రేడియోల్లో మహిళా గళాలపైనా నిషేధం విధించారు.
ఇక మహిళలు ఈ ఉద్యోగాలు చేయకూడదు. పాటలు వార్తలు ఇవేమీ చదవకూడదు. ఇక చాలా మీడియా కంపెనీలు ఇప్పటికే మహిళా యాంకర్లని ఉద్యోగం నుంచి తొలగించారు. మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చునని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చునని తాలిబన్లు చెప్పారు. కాని ఆ మాట మీద వారు ఉండటం లేదంటున్నారు స్ధానికులు.
ఇక చాలా మంది ఉద్యోగాలు చేద్దాము అని అప్లై చేస్తున్నా సదరు కంపెనీలు తాలిబన్లకు భయపడి ఉద్యోగాలు ఇవ్వము అంటున్నారు .బహిరంగ ప్రదేశాల్లో సంగీతాన్ని నిషేధిస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల పరిపాలనలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో అవే ఇప్పుడు అమలు చేస్తున్నారు అని అంటున్నారు జనం.