దేశంలో పెద్ద ఎత్తున కోలాహలంగా కన్నయ్య జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉట్టి కొట్టడాలు, కోలాటాలు ఇలా సందడి సందడిగా ఉంటోంది. ఉత్తరప్రదేశ్లోని కుదర్ కోట్ను శ్రీకృష్ణుని అత్తవారిల్లుగా భావిస్తారు. ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
కుదర్కోట్ను పూర్వకాలంలో కుందన్పూర్గా పిలిచేవారు. శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుని వెళ్లిపోయిన తర్వాత ఆమె సోదరుడు ఏనుగుల సాయంతో ఇక్కడి ప్రజలను తొక్కించాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత నుంచి కుదర్ కోట్ అని పిలిచేవారు.
ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. మధుర-బృందావనం లో ఎంతలా ఆ కన్నయ్య పుట్టినరోజు వేడుకలు జరుగుతాయో ఇక్కడ అలాగే జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ కృష్ణయ్యని పూజిస్తారు భక్తులు.
శ్రీకృష్ణుడిని తమ అల్లుడిగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.