సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య పెళ్లి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వరుడు వధువుని ఆటపట్టించేవి, లేదా డ్యాన్సులు చేసేవి, ఇలాంటి వీడియోలతో పాటు వీరికి సరికొత్త గిఫ్ట్ లు ఇవ్వడం, ఇలాంటి కొన్ని వందల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో మాత్రం ఇలాగే వైరల్ అయింది. అయితే అందరూ షాక్ అయ్యారు ఎందుకు అనేది చూద్దాం.
పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెల్లుమనిపించింది యువతి. ప్రస్తుతం దీనికి సంబంధించిన C. అక్కడ పూజారి మంత్రాలను చెబుతూ పెళ్లి కొడుకును చదవమన్నాడు. అయితే పెళ్లి కొడుకు మాత్రం మంత్రాలను సరిగా పలకడం లేదు. ఇంతకీ ఏమిటా అంటే ఆ వరుడు నోట్లో గుట్కా వేసుకున్నాడు. వెంటనే ఆమె ఈ విషయం గమనించింది.
అతని చెంపను ఒక్కసారిగా చెళ్లుమనిపించింది. దీంతో వెంటనే పైకి లేచిన వరుడు నోట్లోని గుట్కాను పక్కన ఉమ్మేశాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇదేంటి ఇలా పెళ్లి పీటలపై గుట్కా నమలడం ఏమిటి అని అందరూ షాక్ అయ్యారు. ఆమె చేసింది కరెక్ట్ అంటున్నారు.