బిజెపి, ఆరెస్సెస్‌కు కృతజ్ఞతలు : రాహుల్‌

బిజెపి, ఆరెస్సెస్‌కు కృతజ్ఞతలు : రాహుల్‌

0
110

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం బిజెపి ఆరెస్స్సెలకు కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ సహాకార బ్యాంకుకు సంబంధించిన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ తన సైద్ధాంతిక యుద్ధాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు వేదిక కల్పించిన బిజెపి, ఆరెస్సెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ”నా రాజకీయ ప్రత్యర్ధులు ఆరెస్సెస్‌, బిజెపి దాఖలు చేసిన మరో కేసు నిమిత్తం కోర్టులో హాజరయ్యేందుకు అహ్మదాబాద్‌ వచ్చాను. వారిపై నేను జరుపుతున్న సైద్ధాంతిక పోరాటాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళే వేదికను, అవకాశాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. సహకార బ్యాంకు, దాని ఛైర్మన్‌కు సంబంధించిన పరువు నష్టం కేసు కోసమై కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. గత వారం తనపై దాఖలైన వేరువేరు పరువు నష్టం కేసుల్లో ముంబయి, పాట్నా కోర్టులకు హాజరయ్యారు. వయనాడ్‌ నియోజక వర్గం నుండి రాహుల్‌ గాంధీపై కనీసం 20 కేసులు నమోదయ్యాయి.