ఆన్ లైన్ గేమ్స్ పై చైనా కీలక నిర్ణయం – కేవలం ఆ సమయంలోనే ఆడాలి

China's key decision on online games

0
89

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆన్లైన్ వీడియో గేమ్స్ కి పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆన్ లైన్ గేమ్స్ చైనాలో ఎక్కువగా పిల్లలు ఆడుతున్నారు. ఇలా ఖాళీ దొరికితే చాలు పిల్లలు నిత్యం వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇలా ఆడటం వల్ల వారికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు వారి మానసిక పరిస్దితిపై ఇది ప్రభావం చూపిస్తుంది.

దీంతో చైనా ప్రభుత్వం వీడియో గేమ్స్పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వారు ఇకపై వారంలో కేవలం మూడు గంటలు మాత్రమే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుకునేలా ఈ న్యూ రూల్ తీసుకువచ్చారు. ఇది ప్రపంచంలోనే తొలిసారి చైనా అమలులోకి తీసుకువచ్చింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్ అమలు అవుతుంది.

శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కూడా చైనా ఇలాంటి నిర్ణయం 2019లో తీసుకుంది. మరి అక్కడ గేమింగ్ కంపెనీలపై ఇది ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.