జీలకర్ర తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా

Do you know the benefits of taking cumin?

0
80

జీలకర్ర మనం పోపుల పెట్టెలో మసాలా దినుసుగా కూరల్లో వాడుతూ ఉంటాం. ఇక దీని వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్ర మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఊబకాయ సమస్య తగ్గుతుంది. అంతేకాదు బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి. జీలకర్రలో థైమోల్ హార్మోన్ ఉంటుంది.

మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఎవరైనా మలబద్దక సమస్యతో ఇబ్బంది పడితే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. మీకు తెలుసా జీలకర్ర వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
బొడ్డుదగ్గర పొట్టకి వెనుక భాగం కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

జీలకర్ర నానబెట్టిన నీటిని వడకట్టి తాగవచ్చు. లేదా దానిని కషాయంగా మరగబెట్టి ఆ నీటిని తాగితే కూడా మంచిది. అయితే కేవలం జీలకర్ర మాత్రమే ఇలా తీసుకోండి. దీనికి మళ్లీ వేరేది మిక్స్ చేసి ఎట్టి పరిస్దితుల్లో తీసుకోవద్దు.