బిగ్ బాస్ అవినాష్ ఎంగేజ్ మెంట్ – అరియానా ఏమందో తెలుసా

Bigg Boss Avinash Engagement

0
95

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ముక్కు అవినాష్ . అక్కడ తన కామెడీతో అందరిని అలరించాడు. అయితే పెళ్లి విషయంలో మాత్రం పదే పదే పెళ్లి పెళ్లి అని సరదాగా అంటూ ఉండేవాడు. ఇక హౌస్ మేట్స్ కూడా పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవినాష్ ఫ్యాన్స్ ఎప్పుడు మీ పెళ్లి అని అడిగేవారు. అయితే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అవినాష్ . అనూజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోలను షేర్ చేస్తూ త్వరలో మా పెళ్లి అంటూ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు. చాలా మంది చాలా సార్లు నా పెళ్లిపై ప్రశ్నలు వేశారు. అతి త్వరలో నా అనూజతో ఒక్కటి కాబోతున్నా అని తెలిపాడు. ఇక ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు బుల్లితెర నటుల అతనిని అభినందిస్తున్నారు.

అరియానా అవినాష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు అరియానా కూడా అవినాష్ కు పెళ్లి ఫిక్స్ అవ్వడం చాలా హ్యీపీగా ఉంది అని చెప్పింది. ఇక తన పెళ్లి గురించి ప్రశ్నిస్తే ? ప్రస్తుతం సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉన్నాను అని తెలిపింది. తన పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదని బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అని సరదాగా తెలిపింది.