మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నాను అని భరోసా ఇస్తారు. కొన్ని వందల మందికి అన్నయ్య సాయం చేశారు. కాని ఎప్పుడూ ఏ సాయం కూడా బయటకు రాదు. ఎంతో మంచి మనసున్న వ్యక్తి మెగాస్టార్. అందుకే ఆయనని అందరూ అన్నయ్య అంటారు. సినిమా పరిశ్రమలో ఆయన అభిమానులకు, చిత్ర సీమ నటులకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చిరంజీవి అండగా నిలబడతారు.
మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ను అంతే బాగా చూసుకుంటారు. అభిమానులకి ఆర్దికంగా ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి అభిమాని డి.సురేష్ యాదవ్ కూతురు అశ్విత స్కూల్ ఫీజు చెక్కును చిరంజీవి పంపించారు. హయత్నగర్ మండల చిరంజీవి యువత అధ్యక్షుడు డి సురేష్ 2010 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఆ సమయంలో సురేష్ కుటుంబాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. సురేష్ కూతురు అశ్విత చదువు పూర్తి అయ్యేవరకూ ఖర్చులన్నీ తాను భర్తిస్తానని హామీ ఇచ్చారు. అలా ప్రతీ ఏడాది ఆయన చెక్కుని పంపిస్తున్నారు.
ఈ ఏడాదికి సంబంధించి ఫీజు రూ.10 వేల చెక్కును అశ్వితకు అందజేశారు. చిరు చేస్తున్న సేవలని అభిమానులు అందరూ కొనియాడుతున్నారు.