మనం పడవ పై ప్రయాణం చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉంటాం. నీటిలో పడకుండా కాపాడు అని దేవుడ్ని ప్రార్ధిస్దాం. ఈ సమయంలో ఏ జంతువైనా కనిపిస్తే ఇక గుండెలు దడ దడ కొట్టుకుంటాయి. ఇలా ప్రయాణాలు చేసే సమయంలో కొన్ని తిమింగళాలు, పెద్ద పెద్ద చేపలు పాములు కనిపించిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే పడవ – బోటు వెళ్లే స్పీడుకి అవి దిశ మార్చుకున్న ఘటనలు చూశాం.
ఓ యూట్యూబర్ ఇలా పడవలో వెళుతున్న సమయంలో తన వెంట పడిన పాము వీడియో తీశాడు. పడవేసుకొని సముద్రంలోకి వెళ్లిన సమయంలో నీటి నుంచి బయటకు వచ్చిన ఈ పాము అతని దగ్గరకు వచ్చింది. ఆ పడవ పైకి ఎక్కుదాం అనుకుంది మళ్లీ వెనక్కి వెళ్లింది.
సోషల్ మీడియా వేదికల్లో ఇది వైరల్ అవుతోంది. దీనిని చూస్తుంటే కొండ చిలువ కంటే చాలా పెద్దగా ఉంది. అయితే వీటిని నీటి పాములు అంటారట. ఇవి మనుషులని ఏమీ చేయవు అంటున్నారు నిపుణులు .సముద్రపు పాములు నీటి లోపల 250 అడుగుల లోతుకు వెళ్లి కనీసం 8 గంటలు గడిపేస్తాయట. ఇవి కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి అంటున్నారు నిపుణులు.
https://www.instagram.com/p/CTN1190hwQZ/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again