పంజ్షీర్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు తాలిబిన్లు కొద్ది రోజులుగా ఎంతలా పోరుచేస్తున్నారో తెలిసిందే.
ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది. తాలిబన్లు పైచేయి సాధించారు. ఆప్రాంతాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నారు
సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు.
అక్కడ పంజ్షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.
అయితే ఇరు వైపులా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇంకా ఆ వివరాలు రావాల్సి ఉంది.. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్షీర్ను కైవసం చేసుకున్నారని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆ ఒక్క ప్రాంతం పై పట్టులేదు అని అనుకున్నారు. చివరకు తాలిబన్లు ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు.
అక్కడ పరిస్దితులు ఎలా ఉంటాయా అని భయంలో ఉన్నారు జనం.