ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినాయకచవితి జరుపుకుంటారు. మన భారత్ లోనే కాదు మరికొన్ని దేశాల్లో కూడా వినాయకుడ్ని పూజిస్తారు. ఇక రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. మన దేశంలో ఎక్కువగా తెలుగు స్టేట్స్ తో పాటు మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కర్ణాటకలో బాగా జరుపుకుంటారు. గణనాధుడి విగ్రహాలు పెట్టి నవరాత్రులు చేస్తారు.
భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో రోజున గణేశ్ చతుర్థి వస్తుంది. గణేశుడు ఆరోజు జన్మించాడు. ఇక ఏ పూజ అయినా శుభకార్యం అయినా ఆదిపూజ ఆయనే అందుకుంటారు. మరి వినాయకుడికి ఇష్టమైన ఆహారపదార్ధాలు ఏమిటి ఆయనకు ఏవి నైవేథ్యంగా పెడతారు అనేది తెలుసుకుందాం. అయితే దేశ వ్యాప్తంగా చాలా మంది ఇవే నైవేధ్యంగా పెడతారు.
1. వినాయకుడికి కుడుములు ఎంతో ఇష్టం కచ్చితంగా ఈరోజు కుడుములు స్వామికి పెట్టండి.
2. లడ్డూ
3. పప్పు ఉండ్రాళ్లు, తాళికలు , బెల్లం తాళికలు పాల తాళికలు
4. యాపిల్ బాసుందీ
5. రకరకలా పండ్లు
6. హల్వా
7.బొబ్బట్లు
8 .పాయసం
9. పులిహోర
10. క్షీరాన్నం