చాలా మంది వాస్తుని బాగా నమ్ముతారు ఇళ్లు కట్టే సమయంలో వాస్తు పక్కాగా చూసి కడతారు. ఎందుకంటే ఇలా వాస్తు దిశ తెలుసుకుని ఇళ్లు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మన పెద్దల నుంచి చెబుతున్న మాట.
ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంటి సింహద్వారానికి ఎదురుగా, కిటికీల ప్రక్కన చెట్లను పెంచకూడదంటున్నారు.
ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం ఇవి ఎక్కడ పడితే అక్కడ పెంచవద్దు అంటున్నారు. మీరు ఆగ్నేయం వైపు గోడకి 5 నుంచి 6 అడుగులు గ్యాప్ వదిలి వీటిని నాటండి అని చెబుతున్నారు.
ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కను ఉంచి పూజ చేస్తుంటారు. మరి తులసి ఎక్కడ పెంచితే మంచిది అనేది చూస్తే
తులసి మొక్కను మీ ఇంటికి ఉత్తర దిశలో లేదా తూర్పు దిశలో నాటాలి. ఇంటిలో లేదా పూజ గదిలో చిన్న కుండీలో కోటలో ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తులసి కోట ముందు నిత్యం దీపం వెలిగిస్తే మంచిది.