చెక్ బుక్ వాడుతున్నారా ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి లేకపోతే ఫైన్ తప్పదు

Learn These New Rules for Using a Check Book

0
95

చెక్ బుక్ వాడుతున్నారా అయితే కొన్ని నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు చేసేవారు ఉద్యోగులు ఇలా చాలా మంది చెక్ బుక్ వాడుతూ ఉంటారు. అయితే మీ దగ్గర చెక్ బుక్ ఉంటే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.
తమ ఖాతాలో ఎలప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.

దీంతో చెక్ క్లియరెన్స్ శని, ఆదివారాల్లో కూడా చేయొచ్చు. సో ఇలా చేస్తారు కాబట్టి మీరు ఆ సమయంలో అకౌంట్లో నగదు ఉంచుకునేలా చూసుకోండి. ఇక మీరు నగదు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కచ్చితంగా చెక్ బౌన్స్ అవుతుంది. దీని వల్ల జరిమానా కూడా పడుతుంది.

వారంలోని అన్ని రోజులలో NACH సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఈ నాచ్ సేవల నిబంధనలు వర్తిస్తాయి. ఇక చెక్ బుక్ మెయింటైన్ చేసేవారు మీరు చెక్ రాసే సమయంలో అది ఎప్పుడైనా క్లియరెన్స్ అవుతుంది కాబట్టి ఖాతాలో నగదు ఉండేలా చూసుకోండి అంటున్నారు బ్యాంకు అధికారులు.