వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇటు వైష్ణవ్ కి అలాగే కృతికి మంచి పేరు వచ్చింది. దర్శకుడికి తొలి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక తర్వాత వీరు ముగ్గరు చేతినిండా ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. తొలి చిత్రంతోనే కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టికి తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి యాక్ట్ చేశారు.
ఇందులో ఆయన నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఉప్పెనలో బేబమ్మ కృతి శెట్టి పాత్రకు తండ్రిగా నటించానని . అయితే తాను తమిళంలో చేయబోతున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. నాకు ఫోటో పంపించారు అయితే వెంటనే వారికి ఫోన్ చేశాను.
ఆమెకు తండ్రిగా నటించానని, కూతురు పాత్రను పోషించిన ఆమెతో రొమాన్స్ చేయలేనని చెప్పానని తెలిపారు. ఇక సినిమా చేసే సమయంలో కృతి కొన్ని ఎమోషనల్ సీన్స్ కి భయపడింది. ఈ సమయంలో ఆమెకి దైర్యం చెప్పాను నాకు నీ వయసు కొడుకున్నాడు. నీవు నా కూతురులాంటి దానివి. భయపడకుండా ధైర్యంగా చెయ్యి అని చెప్పాను. అలా ఆ అమ్మాయితో
కూతురుగా చేశాను హీరోయిన్ గా జతకట్టలేనని తెలిపారట.