ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డ్ అవసరం అనే విషయం తెలిసిందే. మనకు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఆధార్ కార్డ్ తప్పక ఉండాలి. ఆధార్ లో తప్పులు ఉంటే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆధార్ కేంద్రాల్లో వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆధార్ తీసుకోవాల్సిందే.
అయితే తాజాగో ఓ విషయం తెలుస్తోంది ఇటీవల ఆధార్ కేంద్రానికి వెళ్లిన పౌరులు ఓ విషయం గుర్తించారు. ఏమిటంటే ఆధార్ కార్డును అప్ డేట్ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు – భర్త పేరు అని ఉండదు. కేరాఫ్ అని మాత్రమే ఉంటుంది. ఇక కార్డుదారుడికి వారి బంధుత్వాన్ని తెలిపేది ఉండదట.
ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేక భర్త అనే ఆప్షన్ దగ్గర కేరాఫ్ అనే పదం మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డుకి అప్లై చేసుకున్న కార్డుదారుడు కేరాఫ్ లో తన సంరక్షకుడి పేరును రాస్తే సరిపోతుంది. ప్రజల వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని కొత్తగా ఈ మార్పులు చేశారు.