అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత గుర్తింపు సంపాదించుకున్నారో తెలిసిందే. సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీతో ఆయనకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. మంచి నటుడిగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు విజయ్. ఇక గీతా గోవిందం మూవీతో విజయ్ సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేస్తున్నాడు. అనన్య హీరోయిన్ గా నటిస్తుంది. నెక్ట్స్ విజయ్ ఎవరితో సినిమా చేస్తారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు చూస్తే.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో ఆయన తన నెక్ట్స్ చిత్రం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ సూపర్ హిట్ సినిమాలు చేశారు. నిన్ను కోరి, మజిలి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఆయన తీసిన టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. శివ నిర్వాణ తర్వాత విజయ్ తో సినిమా చేస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో.