ప్రపంచంలో అరుదైన పక్షి అచ్చం పిల్లాడిలా ఏడుస్తోంది – వీడియో వైరల్

The rarest bird in the world is crying like a baby

0
87

ఈ ప్రపంచంలో అనేక రకాల వింతలు ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని ఘటనలు వింటూ ఉంటే అసలు ఇది జరిగిందా అనిపిస్తుంది. మరికొన్నింటికి వీడియో విజువల్ సాక్ష్యాలు ఉంటాయి. జంతువులకి సంబంధించి ఏ విషయం తెలిసినా దాని గురించి మనకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కొన్ని జంతువులు ముఖ్యంగా పక్షులు విచిత్రమైన స్వరం కలిగి ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక పక్షికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో దాని వాయిస్ విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పక్షి చిన్నపిల్లవాడు ఏడుపు ఎలా ఉంటుందో అలాగే ఏడుస్తుంది. సిడ్నీకి చెందిన తారోంగ జూ పార్క్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది ఈ వీడియో.

అయితే ఇది నిజమేనా అని చాలా మంది పదే పదే అక్కడ వారిని అడిగారు . ఇది నిజం అని దానికి అనుబంధంగా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. దీని పేరు లైర్ బర్డ్ ఈ పక్షి అచ్చం చిన్న పిల్లవాడిలా ఏడుస్తోంది. ఇది అనేక రకాల శబ్ధాలు చేయగలదు.

ఇదే ఆ వీడియో

https://twitter.com/i/status/1432489666897453057