నిఫా వైరస్ ఎలా సోకుతుందో చెప్పిన వైద్యులు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

Doctors tell how Nifa virus is transmitted

0
92

`నిఫా వైరస్ బెంబెలెత్తిస్తోంది. కేరళలో నిఫా వైరస్ సోకి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.
నిఫా వైరస్పై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు. గబ్బిలాల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు.

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అంటే. గబ్బిలాలు ఎక్కడ చూసినా గుంపులుగా ఉంటాయి, ఇవన్నీ ఒక చోట నుంచి మరోచోటుకి వెళ్లిన సమయంలో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు తగిన ఔషధం లేదని వివరించారు. నిఫా సోకితే ప్రాణాపాయం ఉంటుందని తెలిపారాయన.

నిఫా వైరస్ గబ్బిలాల నుంచి పందులు, గొర్రెలు వంటి జంతువులకు ముందు సోకుతుందని. వాటికి దగ్గరగా ఉంటే కచ్చితంగా వాటి నుంచి మనుషులకి సోకుతుంది అని తెలిపారు. ఇక పక్షులు సగం కొరికిన పండ్లు కాయలు లాంటివి ఏమీ తినవద్దు అని చెబుతున్నారు. పండ్లు కాయగూరలు ఏదైనా బాగా శుభ్రం చేసుకుని తినాలి అని చెబుతున్నారు నిపుణులు.