చాలా మంది మునగకాయలు ఇష్టంగా తింటారు. ఇక వైద్యులు నిపుణులు కూడా చెబుతారు మునగ కాయలు శరీరానికి మంచిది అని. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది ది బెస్ట్ అని అంటారు. మునగకాడల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు. అనేక పోషక పదార్థాలు వీటిలో ఉంటాయి. మనం కూర, పులుసు ఇలా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ మునగకాయలు తీసుకుంటారు.
మునగకాయల్లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి.
ఐరన్, రిబోఫ్లావిన్ , విటమిన్ A, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.
రీసెర్చర్లు చేసిన రీసెర్చ్ ప్రకారం మునగ తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. అలానే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బాడీలో కొవ్వు తగ్గాలి అనుకునేవారికి కచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి చాలా మంచిది.
ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. జలుబు, జ్వరం ఇలాంటి సమస్యలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు ఆస్తమా, ముక్కు కారడం ఇలాంటివి తగ్గుతాయి రాకుండా కాపాడుతుంది.
ఇందులో కాల్షియం -ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. కాళ్లు నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
.