ప్ర‌పంచంలో అతి పెద్ద చెట్టు ఇదే – ఇది ఉంటే ఏం జ‌రుగుతుందో తెలుసా

The largest tree in the world

0
150

అస‌లు ఈ ప్ర‌కృతిని చెట్లు లేకుండా ఊహించ‌లేము.. మ‌నం వాటికి ఏమీ చేయం కాని అవి మ‌న‌కు ఎంతో సాయం చేస్తున్నాయి. అస‌లు మ‌నం బ‌తుకుతున్నాము అంటే అవి ఇచ్చే ఆక్సిజ‌న్ ముఖ్య కారణం. పండ్లు కాయ‌లు ఇలా అన్నీ ఇస్తూ ఉంటాయి. అయితే మ‌నం అనేక ర‌కాల చెట్లు ఇప్ప‌టి వ‌ర‌కూ చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు తెలుసుకునే ఈ చెట్టు గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుసుకొని ఉండ‌రు.

ఇది ప్రపంచంలో ఎత్తైన చెట్టు చెప్పాలంటే ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పొడవుగా ఉంటుంది.
దీనిని హైపేరియన్ అంటారు. ఇది రెడ్ వుడ్ జాతికి చెందిన వృక్షం. ఇది ఎక్క‌డ ఉందో తెలుసా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో రెడ్‌ ఉడ్‌ నేషనల్‌ పార్క్‌లో ఉంది.

చెప్పాలంటే దీని ఎత్తు 35 అంత‌స్ధుల భ‌వ‌నం కంటే పెద్ద‌ది. ఈ చెట్టు ఎత్తు 115.85 మీటర్లు. దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో న‌మోదు అయింది. ఇక ఇంకా ఇవి ఎక్క‌డ ఎక్క‌డ ఉంటాయంటే.
న్యూజిలాండ్, బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి ఉన్న చోట వ‌ర్షం ఎక్కువ ప‌డుతుంద‌ట‌.