బిగ్‌బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది కంటెస్టెంట్స్ 19 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆట చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈసారి హౌస్ లో వీజే సన్నీ చాలా యాక్టీవ్ గా ఉన్న కంటెస్టెంట్ గా అందరికి కనిపిస్తున్నాడు. అందరితో చాలా సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ ఉన్నాడు. అయితే అసలు ఈ సన్నీ ఎవరు అని చాలా మంది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు.
ఓసారి సన్నీ గురించి చూద్దాం బుల్లితెరపై కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యాడు సన్నీ.
1989లో ఖమ్మంలో జన్మించాడు సన్నీ. అతని పేరు అరుణ్ రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ పూర్తిచేశాడు సన్నీ.
చిన్నవయసులోనే అల్లాదీన్ అనే నాటకం వేసి ప్రశంసలు అందుకున్నాడు. తనకి సినిమాలు అంటే ఇష్టం నటన అంటే ప్రాణం. జస్ట్ ఫర్ మెన్ టీవీ షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు. తర్వాత రిపోర్టర్ గా కూడా కొద్ది కాలం ప్రముఖ ఛానల్ లో పని చేశాడు. తర్వాత వీజేగా మారిపోయారు. ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఇక సకలగుణాభి రామా అనే సినిమాతో రానున్నాడు . అతనికి
కళ్యాణ వైభోగం టీవీ సీరియల్ మంచి గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.