వారం రోజులుగా పోలీసులకి జనాలకి దొరక్కుండా తిరుగుతున్నాడు సైదాబాద్ కేసులో నిందితుడు రాజు. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు శవమై కనిపించాడు. అయితే అతను చనిపోయాడు అని తెలిసి అక్కడ బస్తీ వాసులు అందరూ సంతోషిస్తున్నారు. ఈ దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. నష్కల్ రైల్వే ట్రాక్ పరిశీలిస్తున్న ఇద్దరు లైన్ మెన్లకు రాజు కనిపించాడు. అయితే అతనిని చూసిన వారు ఇద్దరూ పిచ్చివాడు అనుకున్నారు.
తనని చూశారు అనే భయంతో రాజు చెట్లలోకి వెళ్లిపోయాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న మరికొందరు వచ్చే సరికి రాజు చెట్లలో నుంచి మళ్లీ బయటకు వచ్చాడు.
అదే సమయంలో అతనిని పట్టుకుందాం అని వీరు అనుకున్నారు. కాని అటు వైపు అదే సమయంలో
హైదరాబాద్ వైపు కోణార్క్ ఎక్స్ప్రెస్ దూసుకువస్తోంది. రాజుట్రైన్ వైపు దూకాలని భావించాడు. ఇది చూసిన వారు వద్దని వారించినా, రైళు దగ్గరికి వచ్చేసరికి దూకేశాడు. చివరకు అతను చనిపోయాడు అక్కడ వారికి దొరికిపోతాననే భయంతో ఇలా దూకేసి ఉంటాడు అంటున్నారు.