తెలంగాణా కాంగ్రెస్ సారధ్య బృందం అధ్వర్యము లో హైదరాబాద్ కోఠీ వద్ద 1857 అమరవీరుల సంస్మర్ణార్థము నిర్మించిన అశోకా స్థూపం వద్ద హైదరాబాద్ విలీన దినోత్సవము జరిగింది.
” తుర్రెబాజ్ ఖాన్ మెట్రో రైల్ స్టేషన్ ” గా కోఠి మెట్రో రైల్ స్టేషన్- డిమాండు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు పుష్పాంజలి ఘటించిన పి.సి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ పి.సి.సి.అధ్యక్షులు వి.హనుమంత్ రావు, కార్యక్రమ నిర్వాహకుడు, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్.
ఈ సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విలీన పొరాటములో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్వర్యములో జరిగిన పొరాటము మరువలేనిదని, నిజాం ఆంక్షలు విధించినా, జైల్లో పెట్టినా, కాంగ్రెస్ నాయకులు
అలుపెరుగని పొరాటము చేశారని వివరించారు.
ఈ రోజు గొప్పలు చెపుతూ లొల్లి పెడుతున్న బి.జె.పి పాత్ర ఆ పోరాటములో సున్నా అని, పోరాటం చేసింది, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లేనని తెలిపారు.
అధికారములో లేనప్పుడు 17 సెప్టెంబర్ ను అధికారికముగా ఎందుకు చెయ్యరని ప్రశ్నించిన కె.సి.ఆర్ అధికారములోకి వచ్చి, మాట మార్చడము తగదన్నారు.
కర్నాటక,మహారాష్ట్రలో అధికారికముగా నిర్వయిస్తు న్నప్పుడు తెలంగాణా లో కూడా అధికారికముగా ప్రభుత్వం నిర్వహించాలి.
జి.నిరంజన్ మాట్లాడుతూ 1857 లో తుర్రెబాజ్ ఖాన్ అధ్వర్యములో హైదరాబాద్ లో జరిగిన సిపాయి తిరుగుబాటు లో అమరులైన వారికి స్మృతి గా నిర్మించిన అశోకా పిల్లర్ చరిత్ర ను వివరిస్తూ తెలంగాణా రాష్ట్ర సాధన లో 2009 నుండి తెలంగాణా కాంగ్రెస్ సారధ్య బృందము నిర్వయించిన పాత్రను కూడా సవివరముగా వివరించారు.
బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకముగా 1857 లో దేశములో జరిగిన సిపాయి తిరుగుబాటు చరిత్ర మ్యాప్ లో హైదరాబాద్ పేరు తుర్రెబాజ్ ఖాన్ తిరుగుబాటు వలననే చోటు చేసుకుందని తెలిపారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా తుర్రెబాజ్ ఖాన్ అధ్వర్యములో 17 జులై 1857 న కోఠి లోని బ్రిటిష్ రెసిడెన్సీ పై (ప్రస్తుత వుమెన్ష్ కాలేజ్) దాడి జరిగిందన్నారు.
అక్కడనుండి తప్పించుకున్న ఆయనను 22 జులై న అరెస్టు చేసి జీవిత ఖైదు శిక్ష విధించారు. 18 జనవరి 1859 న జైలు నుండి తప్పించుకున్న ఆయనను 24 జనవరిన తూఫ్రాన్ అటవీ ప్రాంతములో ఎన్ కౌంటర్ చేసి ఆయన శవాన్ని రోడ్ పై ఈడుస్తూ తెచ్చి కోఠి రెసిడెన్సీ వద్ద వ్రేలాడ దీశారని తెలిపారు..
తుర్రెబాజ్ ఖాన్ ఙాపకార్తము కోఠి మెట్రో రైల్వే స్టేషన్ ను ” తుర్రెబాజ్ ఖాన్ మెట్రో రైల్ స్టేషన్ ” గా నామకరణం చేయాలి.
ఇటీవల దివంగతులైన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ ఫ్రీడమ్ పైటర్స్ పోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు కీ:శే: బి.బాబురావు వర్మ గారి కృషి వలన అశోకా స్తూపము దాని చరిత్ర సురక్షితముగా ఉన్నది.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్ , మాజీ ఎం.ఎల్.సి కమలాకరరావు, జి.కన్నయ్య లాల్, పి.రాజేష్ కుమార్, రాజేందర్ రాజు, జి.రాజరత్నం , రాజేశ్ వాల్మీకి, చంద్రశేఖర్. మధుసూధన్ గుప్తా, అశోక్ రెడ్డి, మూసా ఖాసిం, శ్రీ ఓంప్రకాశ్ శర్మ, ఆర్.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.