గడ్డి చామంతి మొక్కతో ఎన్ని లాభాలో తెలుసా

Do you know how many benefits with grass chamomile plant

0
81

గడ్డి చామంతి మొక్క ఇది చాలా మందికి తెలిసిందే. పెద్ద పరిచయం కూడా అక్కర్లేదు. మనం చిన్నతనం నుంచి దీనిని చూస్తున్నాం. ఇప్పటి వారికి కూడా కొందరికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. అయితే ఇది పల్లెల్లో చాలా చోట్ల కనిపిస్తుంది.
ఈ కలుపుజాతి గడ్డి చేమంతి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే తగ్గుతుంది. అనేక చర్మ వ్యాధులకి ఇది సంజీవనిగా చెబుతారు.

బిహర్ యూపీలో ఏపీలో చాలా చోట్ల పల్లెటూర్లలోని రైతులు గడ్డి చామంతిని పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తామర, గజ్జి, బొబ్బలు , గాయాలకు ఈ గడ్డి చామంతిని రసాన్ని వాడుతున్నారు.ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది.

దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు ఆపి తలుపుల మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి. అంతేకాదు ఈ ఆకులు తలుపుల మూల పెట్టినా కిటకాలు రావు. ఇవి ఎండిన తర్వాత ఆకులను పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు ఇంట్లోకి రావు.