ఈ రోజుల్లో వైట్ రైస్ తినే వారి సంఖ్య తగ్గుతోంది . ఇప్పుడు వైట్ రైస్ తినేందుకు అందరూ వెనుకాడుతున్నారు. షుగర్ సమస్య వస్తుందని, అలాగే ఆల్రెడీ చక్కెర వ్యాధి ఉన్నవారికి షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయిని ఈ రైస్ ని తినడం లేదు. ఈ సమయంలో పోషకాలు ఉండే ఫుడ్ తింటున్నారు. ఈ మధ్య నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎక్కడ చూసినా బ్లాక్ రైస్ సేల్ పెరిగింది అంటున్నారు.
ఈ బ్లాక్ రైస్ లో పోషకాలు సమృద్ధిగా ఉండటంతో వీటిని చాలా మంది తీసుకుంటున్నారు. వీటిలో ఫైబర్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో చాలామంది ఈ బియ్యాన్ని తినేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో బ్లాక్ రైస్ సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇక్కడ పంట అనేది వచ్చే రోజుల్లో మరింత ఎక్కువగా వస్తుంది అంటున్నారు రైతులు.
100 గ్రాముల నల్ల బియ్యం లో 8.5 గ్రాముల ప్రొటీన్లు, 3.5 గ్రాముల ఐరన్, 4.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది కేవలం ఎకరాకు 12 నుంచి 18 బస్తాల దిగుబడి వస్తుంది. అందుకే ధర ఎక్కువ. బ్లాక్ రైస్ కిలోరూ. 150 నుండి 180 వరకు ధర ఉంది.
బ్లాక్ రైస్ పంట రావడానికి 140 రోజులనుంచి 150 రోజులు పడుతుంది. ఈ విషయం తెలుసా ? కేరళ రాష్ట్రంలో ఆయుర్వేద మందు లో ఈ బ్లాక్ రైస్ ను ఉపయోగిస్తారు. మధుమేహం క్యాన్సర్ గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది . ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.