వివాహం అనేది జీవితంలో ఎంతో మధురమైనది. ఇక తన భర్తే జీవితం అనుకుని అత్తవారింటిలోకి అడుగుపెడుతుంది కోడలు. ఇక భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తనే సర్వస్వం అనుకుంటాడు భర్త. ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా వీరి జీవితం సాగాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే
హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లాడిన తర్వాత వధువు వచ్చి భర్త కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది.
ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారామే, అయితే తాజాగా వరుడు మాత్రం దీనికి సరికొత్త అర్ధం చెప్పాడు, ఎప్పుడూ భార్య వచ్చి భర్త కాళ్లకి నమస్కారం చేయడం కాదు మనం కూడా వారికి నమస్కరించాలి అని అనుకున్నాడు. భార్య తన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడంతో, తాను కూడా ఆమె పాదాలకు నమస్కరించాడు. భార్యాభర్తలిద్దరూ సమానమనే ఉద్దేశ్యంతోనే అతను ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫిదా అయ్యారు. వీరికి అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ వధూవరులిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారని తెలుస్తోంది.