చిన్న గ్రామంలో ఇళ్లు కొన్న దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ దంపతులు – రేటు ఎంతంటే

Deepika Padukone and Ranveer Singh buy a house in a small village

0
74

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో దీపిక రణవీర్ జంట ఒకటి . వారు ఏం చేసినా సంచలనమే. వీరు కలిసి ఎక్కడికైనా వచ్చారు అంటే అభిమానులకి ఫుల్ హ్యాపీ. ప్రస్తుతం దీపికా, రణవీర్ సింగ్ ఎవరికి వారు వరుస చిత్రాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఇక కాస్త విరామం దొరికితే విదేశాలకు వెళతారు. ఇక పలు కంపెనీల యాడ్స్ కూడా చేస్తున్నారు.
తాజాగా ఈ జంట మహారాష్ట్రాలోని ఓ చిన్న గ్రామంలో ఖరీదైన ఇల్లు కొన్నారు. ఈ వార్త ఇప్పుడు బీటౌన్ లో తెగ వైరల్ అవుతోంది.

మహారాష్ట్రాలోని అలిబాగ్లోని మాప్గావ్ అనే గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. అయితే ఇది అత్యంత ఖరీదైన ఇళ్లు అని తెలుస్తోంది. ఏకంగా 22 కోట్లు ఖరీదు అంటున్నారు. అయితే ఆ ఇళ్లు పూర్తిగా 2.25 ఎకరాలలో విశాలంగా నిర్మించారట. ఈ బంగ్లా ది ఎవర్ స్టోన్ గ్రూప్ అధినేత రాజేష్ జగ్గికు చెందినదిగా తెలుస్తోంది.

స్టాంప్ డ్యూటీగా రూ. 1.32 కోట్లు చెల్లించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటిలో 5 పడక గదులు ఉండగా.. కిహిమా బీచ్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో ఉందట. ఇక్కడ చాలా మంది సినిమా సెలబ్రెటీలకి సొంత ఇళ్లులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ జంట కూడా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.