అందం అభినయంతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరోయిన్ రమ్యకృష్ణ.
ఆనాడు నీలాంబరిగా, నేడు తిరుగులేని శివగామిగా ఆమెకి చిత్ర సీమలో ఎంతో గుర్తింపు ఉంది. నటన విషయంలో ఆమెని ఎందరో దిగ్గజ దర్శక నిర్మాతలు హీరోలు హీరోయిన్లు శభాష్ అన్నారు. మరి ఎవర్గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి కొన్ని విషయాలు ఈ రియల్ స్టోరీలో తెలుసుకుందాం.
1970, సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ జన్మించారు. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ స్వయానా మేనకోడలు. ఆమెకి డ్యాన్స్ అంటే చిన్నతనం నుంచి ఇష్టం. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. తల్లిదండ్రులు కృష్ణన్, మాయ. ఇక ఆమెకి 14 ఏళ్లు వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
వెళ్ళై మనసు అనే తమిళ సినిమాతో చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తెలుగులో భలే మిత్రులు అనే సినిమాతో రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్లతో ఆమె అనేక చిత్రాల్లో నటించారు.
ఇలా ఎందరో స్టార్ హీరోలతో ఆమె నటించారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర ఎంతో పేరు తీసుకువచ్చింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రమ్యకృష్ణ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.