నోటి దుర్వాసన వేధిస్తోందా నలుగురిలో ఇబ్బందిగా ఉందా ఇలా చేయండి

Medical tips for bad breath problem

0
64

ఈరోజుల్లో అనేక రోగాలు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్దితి వచ్చింది. పూర్తిగా ప్రాసెసింగ్ ఫుడ్ మార్కెట్లో ఉంటోంది. ఇక చాలా మందికి ఈ మధ్య నోటి దుర్వాసన సమస్య వేధిస్తోంది. నలుగురితో మాట్లాడే సమయంలో ఈ వాసన రావడంతో పక్క వారు కూడా మనల్ని చిన్నచూపు చూస్తారు అనే భయం కూడా కలుగుతోంది. ఎంత బాగా పళ్లు తోముకున్నా, రెండు మూడుసార్లు బ్రష్ చేసుకున్నా, మాకు ఈ సమస్య పోవడం లేదు అని చాలా మంది వైద్యుల దగ్గరకు వెళుతూ ఉంటారు.

ఇక్కడ ఓ విషయం గుర్తించాలి శరీరంలో నోరు, దంతాలు, చిగుళ్లు, గొంతు సమస్యలు, జీర్ణవ్యవస్థ సరిగా జరగకపోవడం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటివి తింటే దుర్వాసన ఎక్కువగా వస్తుంది ( కొందరికి మాత్రమే ). ముఖ్యంగా జున్ను, మసాలా దినుసులు, నారింజ రసం, సోడా, ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఎక్కువ వాసన కలిగిస్తాయి.

నోటిలో తడిలేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే నీరు ఎక్కువ తాగాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
ధూమపానం మద్యం అలవాట్లకి దూరంగా ఉండాలి. కాఫీలు టీలు ఇలా దుర్వాసన వచ్చే వారు కొద్ది రోజులు దూరంగా ఉండాలి.
వాము, తులసి, పుదీనా ఇలాంటివి ఆహారంలో తీసుకోవాలి. వీలైనంత వరకూ తృణధాన్యాలు, పండ్లు, క్యారెట్లు, పుచ్చకాయలు, తినాలి. నోటిని వీలైనన్ని సార్లు వాటర్ తో పుక్కలించాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోండి.