ఫారెస్ట్ లో పులిని చూసి ఫోటోలు – దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే

Photos of seeing a tiger in the forest

0
77

అడవిలో జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కృరమృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. అందుకే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి . ముఖ్యంగా పులులు సింహాలతో ఆట వేట చాలా డేంజర్ . కొందరు టూరిస్టులు పెట్టే వీడియోలు అలాగే జంగిల్ సఫారీకి సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తు ఉంటాం. కొన్ని వీడియోలు చాలా భయం కలిగిస్తాయి .

ఎటువైపు నుంచి జంతువులు వస్తాయో తెలియదు. కానీ ఒక్కసారిగా మన దగ్గరకు వస్తాయి. తాజాగా ఇక్కడ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులి తన మార్గంలో ఎంచక్కా సేద తీరుతూ హాయిగా వస్తోంది. ఈ సమయంలో టూరిస్టులు దానిని ఫోటో తీస్తున్నారు. ఇక అది దగ్గరకు వస్తున్నా పట్టించుకోకుండా ఫోటో తీస్తూ ఉండిపోయారు .ఈ సమయంలో అది దాడి చేసి ఉంటే పెను ప్రమాదం సంభవించేది.

ఈ సమయంలో పులి వారి దగ్గరకు రావడం.. అది బెదరగొట్టడం కూడా జరిగిపోయింది. ఇక జీపులో ఉన్న వారు కాస్త టెన్షన్ పడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు.