కొంత మంది ఆకతాయిలు అమ్మాయిలు కనిపిస్తే వారిని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ రోడ్లపై నడవనివ్వకుండా చేస్తారు. ఇలాంటి వారికి చెప్పు తెగేలా కొందరు అక్కడే సరైన బుద్దిచెబుతారు. మరికొందరు వారిని పట్టించుకోకుండా వెళతారు. అందుకే పోలీసులు ఇలాంటి వారు ఉంటే కచ్చితంగా తమకు ఇన్ ఫామ్ చేయాలి అని తెలియచేస్తున్నారు. షీ టీమ్స్ ఎక్కడికక్కడ ఉంటున్నాయి.
కొంతమంది వెధవలు చున్నీలు లాగటం మీద చేయి వేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ముంబైకి చెందిన ఓ యువతి ఇలాంటి సన్నాసికి తగిన బుద్ది చెప్పింది. తనను ఏడిపించి చున్నీ పట్టుకుని లాగి నానా అల్లరి చేసినవాడిపై కేసు పెట్టింది. అబ్రార్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు నా చున్నీ పట్టుకుని లాగి అసభ్యంగా మాట్లాడాడు అని అతనిపై 2016లో కేసు పెట్టింది.
ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో అతనిని ప్రవేశపెట్టారు . విచారణల తర్వాత ఎట్టకేలకు కోర్టు అతడు నేరం చేశాడని నిర్ధారించింది. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఇకపై ఇలాంటి పని చేయను బుద్దిగా ఉంటాను అని అతను కోర్టుని వేడుకున్నాడు. కాని అతనికి ఈ శిక్ష విధించింది కోర్టు.