బంగారం వజ్రాలు ముత్యాలు ఇలాంటివి ఎంత ఖరీదు ఉంటాయో తెలిసిందే. డైమండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వందల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు కూడా ఉన్నాయి. అయితే మనదేశంలో వజ్రాలతో చిన్న చిన్నవస్తువులు ఆభరణాలు చేయించుకుంటారు. మరికొందరు దేవతా విగ్రహాలు చేయించుకుంటారు. అయితే మనకు వజ్రాల వ్యాపారం అంటే ముందు గుజరాత్ అక్కడ సూరత్ గురించి చెప్పాలి.
డైమండ్ సిటీ అంటారు సూరత్ ని. ఇక్కడ చాలా మంది వ్యాపారులు వజ్రాలతో అనేక దేవతామూర్తుల విగ్రహాలు చేయించుకున్నారు. అయితే సూరత్లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ బెల్జియం నుంచి ఓ విగ్రహం తీసుకువచ్చారు. అది వినాయకుడి విగ్రహం చూడటానికి చిన్నగా ఉన్నా ఖరీదైనది. 182.53 క్యారెట్ల వజ్రంలో గణేశుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది.
బెల్జియం వజ్రాల గనిలో నుండి బయటకు వచ్చిన ఈ వజ్రంలో గణేష్ తొండం, చేతులు, కళ్ళు, కాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రపంచంలో చాలా అరుదైనది గా చెబుతారు దీని విలువ సుమారు
500 కోట్లు ఉండచ్చట. ఈ వజ్రం ఆ వ్యాపారి దగ్గర ఉంటుంది. కేవలం పూజల సమయంలో మాత్రమే దీనిని తీస్తారు చాలా భద్రంగా దీనిని ఉంచుతారట.