మనలో ప్రతీ ఒక్కరు ఇళ్లు నిర్మించుకునే సమయంలో పక్కా వాస్తుని బట్టీ ఇళ్లు కడతాం. ఇక మనకు నప్పేది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేది చూసుకుంటా. మనం ఏ పని చేసినా ఆ వైపు ఉండేలా ముందుకు సాగుతాం. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు కొందరు. ఇంటిలో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తుని ఫాలో అయ్యేవారు ఉంటారు.
అయితే వీటిని నమ్మేవారు, పాజిటీవ్ ఎనర్జీ నెగిటీవ్ ఎనర్జీ అనేది కొన్ని వస్తువులు ఒకచోట నుంచి మరోచోటికి పెడితే వస్తుంది అని నమ్ముతారు (కేవలం కొందరు మాత్రమే). వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయంటున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అనేది చూద్దాం.
1. ఇంటిలో ఎట్టి పరిస్దితుల్లో ఈశాన్యం మూలన చెత్త అనేది ఉంచకూడదు
2. ఇంటిలో మూలన చీపురు పెడతారు ఇది గుమ్మం నుంచి వచ్చేవారికి కనిపించకుండా ఉండాలి
3. దేవుడి గూటికి ఆన్చి చీపురు పెట్టకూడదు
4. నరికిన పచ్చని చెట్లు ఇంటి సరిహద్దుల్లో వేయకూడదు ఏ దిశలో అయినా
5. విరిగిన ఫర్నిచర్
6. చెదపట్టిన చెక్కలు
7. తుప్పు పట్టిన ఐరన్ అస్సలు ఉంచకూడదు
8. పావురం ఇంటి హద్దుల దగ్గర గూడు పెట్టుకుంటే దానిని ఉదయం చూడకూడదు.
9. ఆగిపోయిన గడియారం ఏ దిక్కులో ఉంచవద్దు
10. తూర్పు దక్షిణం దిక్కున అస్సలు పగిలిన విరిగిన వస్తువులు ఉంచకూడదు