అశ్లీల వెబ్ సైట్లు ఓపెన్ చేస్తున్నారా ఇక జైలుకే

Opening pornographic websites is no longer a prison

0
74

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్ నెట్ ప్యాక్ ఉంది మా ఇష్టం వచ్చింది చూస్తాం సెర్చ్ చేస్తాం అంటే కుదరదు. ముఖ్యంగా కొందరు అశ్లీల వెబ్ సైట్లు ఓపెన్ చేసి చూస్తున్నారు. అంతేకాదు చిన్నారులకు సంబంధించి ఇలాంటివి చూసి ఆనందం పొందుతున్నారు కొందరు మానవ మృగాలు. ఇక అలాంటి వారు జైలుకి వెళతారు. అభం శుభం తెలియని ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు.

అశ్లీల సైట్స్ చూసి వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు అని కేంద్రం కూడా భావిస్తోంది. అందుకే ఇలాంటి వారికిచెక్ పెడుతోంది. వార్నింగ్ లు ఇవ్వడాలు కాదు నేరుగా జైలుకే పంపనున్నారు . చైల్డ్ పోర్నోగ్రఫీపై వరల్డ్ వైడ్ గా నిషేధం విధించారు.
నెట్ లో అశ్లీల చిత్రాలు, చైల్డ్ పోర్న్ సైట్స్ సెర్చ్ చేసే వారిపై ఫోకస్ పెట్టింది NCRB. ప్రత్యేక సెల్ 24 గంటలు మానిటర్ చేస్తుంది.

ఎవరైనా ఇలా చిన్నారుల గురించి అశ్లీల వీడియో చూద్దాం అని టైప్ చేసినా ఇక అంతే సంగతులు. చైల్డ్ పోర్న్ అని టైప్ చేసినా వెంటనే వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఐపీ చిరునామాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ
సమాచారం పంపస్తారు. ఇక వారిపై కేసులు పెడతారు.