సల్మాన్ ఖాన్ కి బిగ్ బాస్ సీజన్ 15కు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్

It would be a shock if Salman Khan knew the remuneration for Bigg Boss Season 15

0
110
Salman Khan

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయన బిగ్ బాస్ షోకి హోస్ట్ గా కూడా ఉన్నారు. బుల్లితెరపై సందడి చేస్తున్నారు సల్మాన్. త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 15కు ఈయన హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే ఈ షోలో సీజన్ సీజన్ కి సల్మాన్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు టాక్ నడుస్తుంది. ఈసారి కూడా సల్మాన్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

బిగ్ బాస్ షో హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా మంచి సక్సెస్ సాధించింది. అంతేకాదు తెలుగులో కూడా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదోసీజన్ నడుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్ 15లో ఒక్కో ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం హిందీలో ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ 14 సీజన్స్ లో 11 సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించారు.

శని ఆదివారాలు ఆయన వీకెండ్ లో చేసే సందడి ఎంతో బాగుంటుంది. కోట్లాది మందికి ఫేవరేట్ షోగా మారింది. 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజులు సల్మాన్ ఖాన్ హౌస్ లో కనిపిస్తారు. ఈసారి మొత్తం సీజన్ కి సల్మాన్ ఖాన్ రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు పారితోషకం అందుకునే అవకాశాలున్నాయని బీ టౌన్ టాక్. దాదాపు ఐదు సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్ ఆయన బిగ్ బాస్ షో ద్వారా సంపాదిస్తున్నారు అని అంటున్నారు.