ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ఊరి నుంచి వెలివేయడం, అంతేకాకుండా ఆ జంటని దారుణంగా శిక్షించడం, లేదా గ్రామంలో కఠినమైన తీర్పు ఇచ్చి వారి కుటుంబాలని కూడా బయటకు వెలివేయడం అనే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
మధ్యప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. ఎవరైనా తప్పుచేస్తే అక్కడ గ్రామ పెద్దలుగా చెలామణి అవుతున్న వారే శిక్షలు వేస్తున్నారు.
ధార్ పరిధిలోఒక గ్రామంలో ప్రేమ జంటకు తాలిబన్ల తరహా శిక్షను అమలు చేశారు. కుండీ గ్రామంలో సెప్టెంబరు 12 న దారుణం జరిగింది. కుండీ ప్రాంతానికి చెందిన ఒక యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు దీంతో ప్రియుడు గోవింద్తో కలసి గుజరాత్కు పారిపోయింది ఆ యువతి.
ఇక అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులకి ప్రియుడితో ఆమె ఇంటికి వచ్చింది. దీంతో ప్రేమికులిద్దరితో పాటు వారికి సహకరించిన మరో బాలికను కూడా చితకబాదారు ఇంటి సభ్యులు . వారిని గ్రామంలో నిలబెట్టి మెడలలో టైర్లు వేసి ఊరంతా తిప్పారు. దీనిని వీడియో తీశారు ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వారిని ఐదుగురిని గుర్తించారు వారిపై కేసు నమోదు చేశారు.