మనం ఆదిపూజ వినాయకుడికి చేస్తాం. ఏ శుభకార్యం అయినా పూజలు వ్రతాలు అయినా ముందు వినాయకుడికి ఆదిపూజ చేస్తాం. ఇక వినాయక చవితి వచ్చింది అంటే నవరాత్రుల సందడి ఎంతగానో ఉంటుంది. ఇక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడిని ప్రతీ ఏడాది చాలా ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు దర్శిస్తారు.
అయితే ఖైరతాబాద్ గణేషునికి ఎంతో చరిత్ర ఉంది .దేశంలోనే ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యమైనది. సుమారు 68 ఏళ్లుగా నిరాటంకంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. 11 రోజులు ఖైరతాబాద్ ప్రాంతం లక్షలాది మంది జనంతో భక్తులతో కోలాహలంగా ఉంటుంది.1954లో ఒక్క అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు , ఇక్కడ ప్రతీ ఏటా విగ్రహం అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు.
2014లో 60 అడుగుల ఎత్తులో షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. 2019లో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఇక్కడి విగ్రహం అరుదైన గుర్తింపు సాధించింది. 61 అడుగుల ఎత్తులో శ్రీద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిచ్చారు. అనేక దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఖైరతాబాద్ గణపయ్యని చూసి వెళతారు. ఇక్కడ లడ్డూ కూడా దేశంలోనే అతి పెద్దలడ్డూని స్వామికి సమర్పిస్తారు.