వినాయక్ కాస్త రంగు తక్కువైనప్పటికీ, ఆయన ఫేస్ లో మంచి కళ వుంటుంది. కొంతకాలం క్రితం నాటి ఆయన ఫొటోలు చూస్తే, ఆయన తమిళ హీరోలా అనిపిస్తారు. ఆయన ఆర్టిస్ట్ గా చేయవచ్చనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేశారు కూడా. అలాంటి వినాయక్ మొత్తానికి తెరపైకి రావడానికి అంగీకరించారు.
‘శరభ’ దర్శకుడు నరసింహారావు ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ కథకి నాయకుడిగా ఆయన వినాయక్ ను ఎంచుకున్నాడు. దాదాపు తన చుట్టూ తిరిగే ఈ కథతో వినాయక్ పూర్తిస్థాయి నటుడిగా తెరపై కనిపించనున్నారు. పాత్రకి తగినట్టుగా బరువు తగ్గడం కోసం ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారని టాక్ వినిపిస్తోంది.