బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఉమాదేవి షాకింగ్ కామెంట్స్

Umadevi shocking comments eliminated from Bigg Boss House

0
71

బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూశారు. మొత్తానికి 5 వ సీజన్ స్టార్ట్ అయింది. ఇంటి సభ్యుల ఆట అందరికి నచ్చుతోంది. అయితే నాలుగు సీజన్లు చూసిన వారు ఐదో సీజన్ లో సరికొత్త టాస్కులతో బిగ్ బాస్ గేమ్ మారుస్తారు అని అనుకున్నారు. అలాగే సరికొత్తగా సాగుతోంది. టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం సరయు రెండోవారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు.

టాలీవుడ్ నటి ఉమాదేవి తాజాగా సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. బిగ్ బాస్ షో ఓ స్క్రిప్టు ప్రకారం నడుస్తుందని చాలామంది భావిస్తుంటారని. అది అసలు నిజం కాదు అని ఆమె తెలిపారు. ఇదిఅస‌లైన షో మనం ఆడేది చూపిస్తారు అని ఆమె తెలిపారు.

ఇక హౌస్ లో తన ఎలిమినేషన్ గురించి చెబుతూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను తాను బయట ఎలా ఉంటానో హౌస్ లో కూడా అలాగే ఉన్నాను అని ఆమె తెలిపారు. ఇంటి సభ్యులు తన మాటతీరును సరిగా అర్థం చేసుకోలేకపోయారని అభిప్రాయపడింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండుంటే ఇంకా వినోదం పంచేదాన్నని బాధపడ్డారు . మరోసారి అవకాశం వస్తే తప్పకుండా వెళతా అని ఆమె తెలిపారు.