పచ్చిపాలు తాగవ‌చ్చా? తాగకూడదా నిపుణులు ఏమంటున్నారు

Do you drink milk? Be careful

0
96

మనలో చాలా మంది ఉదయం లేవగానే పాలు కచ్చితంగా తాగుతారు. ఇక పిల్లలకు కూడా ఉదయం పాలు ఇస్తాం. అయితే కొందరికి ఓ అనుమానం ఉంటుంది? పచ్చిపాలు తాగవ‌చ్చా తాగకూడదా అని అయితే వైద్యులు చెప్పేదాని ప్రకారం పచ్చిపాలు తాగవద్దు అని చెబుతారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది రోజుకి రెండు సార్లు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలకు కూడా చాలా మంచిది.

ముఖ్యంగా ఎవ‌రైనా పాలు కాచిన తర్వాత మాత్ర‌మే ఉపయోగించాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చి పాలలో విషతుల్యమైన బ్యాక్టీరియా ఉంటుంది. మనం నేరుగా తాగితే కడుపు లోకి వెళ్ళి అనేక అనారోగ్య సమస్యలు తీసుకువస్తుంది. పిల్లలకు అయినా పెద్దలకు అయినా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వస్తుంది. కిడ్నీల సమస్యలు వస్తాయి.

పచ్చి పాలు చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెడిసన్స్ వాడుతున్న వారు అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు చాలా మంది జ్యూస్ లు అవి తాగిన సమయంలో ఇలా పచ్చిపాలు అందులో మిక్స్ చేసి తాగుతారు. ఇలా కూడా వద్దు అని చెబుతున్నారు నిపుణులు. వేడి చేయని పాలు తాగితే అనేక సమస్యలకు మనం వెల్ కం పలికినట్లే.