పుష్పరాజ్ ప్రేయసిగా శ్రీవల్లి ఇంట్రెస్టింగ్ లుక్

0
114

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ లుక్ లో రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈ పోస్టర్ లో ఆమె అద్దం ముందు మల్లెపూలు, చెవులకు దిద్దులతో ముస్తాబవుతూ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. కాగా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి పార్ట్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు టాక్.